కోనసీమ: మండపేట మండలం శవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం ప్రపంచ ప్రీ-ఎక్లంప్సియా దినోత్సవం సందర్భంగా గర్భిణీలకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. డాక్టర్ బిఎన్డి.సంధ్య ఈ సదస్సుకు హాజరై మాట్లాడుతూ.. ‘శిశు, తల్లి ఆరోగ్యం కోసం అంచనా వేయండి, నివారించండి, విజయం సాధించండి’ అనే నినాదాన్ని ప్రతి గర్భిణీ గుర్తుంచుకోవాలని పిలుపునిచ్చారు.