ADB: ఆదిలాబాద్ పట్టణంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో మ్యాదరి భాగ్యరెడ్డి వర్మ 138వ జయంతి కార్యక్రమాన్ని షెడ్యూల్ కులాల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అదనపు కలెక్టర్ రాజేశ్వర్ భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. షెడ్యూలు కులాల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ఆయన చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు.