JGL: రైతులు తమ ధాన్యం కొనుగోళ్లపై అధైర్య పడొద్దని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. శుక్రవారం గొల్లపల్లి మండలం తిరుమలాపూర్లో ఒంగోలు కేంద్రంలో నూతనగా ఏర్పాటుచేసిన ట్రాన్స్ఫార్మర్, బోరు బావి ప్రారంభించిన సందర్భంగా మంత్రి మాట్లాడారు. రైతు పండించిన వరి, మొక్కజొన్నను చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులకు హామీ ఇచ్చారు.