కృష్ణా: పెనమలూరు మండలం పోరంకిలోని పేకాట నిర్వహిస్తున్నారన్న సమాచారంతో ఎస్ఐ ఉషారాణి ఆధ్వర్యంలో శుక్రవారం పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.16,240 నగదు, నాలుగు సెల్ఫోన్లు, ఒక కారు, రెండు బైకులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.