BHPL: కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా పారిశుధ్య పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. భారీగా భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. 18 మంది అధికారులు, సుమారు 300 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.