CTR: పెద్దిరెడ్డి అంటే చంద్రబాబుకు ఎంతో భయమని వైసీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. సదుం మండలం ఎర్రాతివారిపల్లెలో నిర్వహించిన సమావేశంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. అధికారం అడ్డం పెట్టుకుని చంద్రబాబు వైసీపీ మద్దతుదారు ఓట్లను తొలగించే కుట్ర చేస్తారని ఆరోపించారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.