SRPT: పోలుమల్ల గ్రామంలో ఉపాధి హామీ పనులను పరిశీలించేందుకు వెళ్లిన కలెక్టర్ తేజస్‌కు ఓ వృద్ధ కూలీ అవ్వ తన కష్టాలను కన్నీటి పర్యంతమై వివరించింది. వెంటనే స్పందించిన కలెక్టర్ ఆమె చేతులు పట్టుకుని ఆప్యాయంగా పరామర్శించారు. “మీరు పెద్దవారు.. చేతులు జోడించవద్దు” అంటూ ఓదార్చారు. కలెక్టర్ చూపిన మానవత్వం, ఆప్యాయత అక్కడున్న కూలీలను భావోద్వేగానికి గురిచేసింది.