MHBD: ఆకేరు వాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నట్లు నర్సింహులపేట ఎస్సై భానోత్ వెంకన్న శుక్రవారం సాయంత్రం తెలిపారు. అట్టి ఇసుక ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసి సీజ్ చేసినట్లు వివరించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.