MHBD: తొర్రూరు మండలం సోమారపుకుంట తండాకు చెందిన భానోత్ రవి నాయక్ మృతి చెందగా, వారి కుటుంబాన్ని తొర్రూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, మడిపల్లి మాజీ ఎంపీటీసీ జక్కా మహబూబ్ రెడ్డి పరామర్శించారు. అనంతరం బాధిత కుటుంబానికి రూ.3000 నగదు, 25 కేజీల బియ్యం అందజేశారు. రవి నాయక్తో తనకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకొని కన్నీరు పెట్టుకున్నారు.