BDK: మణుగూరు మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఇవాళ ఘనంగా శంకుస్థాపనలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి, పట్టణ మౌలిక వసతుల కల్పన, సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఆయన వెల్లడించారు.