TPT: రేణిగుంట ఆర్టీసీ బస్టాండ్లో డీఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో సీఐ జయచంద్ర ఆటో డ్రైవర్లకు సైబర్ మోసాలు, గంజాయి నివారణ, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. డీఎస్పీ మాట్లాడుతూ.. అపరిచితుల ఫోన్ కాల్స్, ఓటీపీ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు.