SRCL: గంజాయి అరికట్టడానికి డాగ్ స్క్వాడ్ పోలీసులు శుక్రవారం చందుర్తి మండల కేంద్రంలో తనిఖీలు చేపట్టారు. డాగ్ స్క్వాడ్ బృందం ఎస్ఐ జిల్లేల రమేష్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో పాన్ షాప్ లు, టీ స్టాల్ వద్ద స్పోక్ జోన్ ప్రాంతాలు, కిరాణా దుకాణాలలో డాగ్ స్క్వాడ్ ద్వారా తనిఖీలు చేపట్టారు. తిమ్మాపూర్, రామన్నపేట, తదితర గ్రామాల్లో తనిఖీలు చేపట్టారు.