CTR: సోమల మండల కేంద్రంతోపాటు నంజంపేటలో జన గణన కార్యక్రమాన్ని తహసీల్దార్ మధుసూదన్ శుక్రవారం తనిఖీ చేశారు. తాళం వేసిన, పాడుబడిన ఇళ్ల వివరాలను ఎలా నమోదు చేస్తున్నారో ఆరా తీశారు. గణన పూర్తి చేసిన ప్రతి ఇంటికి నెంబరింగ్ వేయాలని ఆదేశించారు. సాయంత్రం, ఉదయం వేళల్లో గణన నిర్వహించాలన్నారు. అలాగే, శని, ఆదివారాలలో స్పెషల్ డ్రైవ్ చేపట్టాలన్నారు.