MNCL: ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యాచరణను అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో పకడ్బందీగా అమలు చేయనున్నట్లు కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. శుక్రవారం మంచిర్యాల కలెక్టరేట్ లో నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో మాట్లాడారు. ఈ ప్రణాళిక ద్వారా సంక్షేమ పథకాలు, నిలిచిపోయిన అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేసి ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యం అన్నారు.