NLG: తిప్పర్తి మండల ప్రభుత్వ పాఠశాల 10వ తరగతి టాపర్ విద్యార్థులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రత్యేక బహుమతి అందించారు. మంచి మార్కులు సాధిస్తే సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ విద్యార్థులకు విమాన ప్రయాణంతో రెండు రోజుల వైజాగ్ టూర్ ఏర్పాటు చేశారు. దీంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.