NTR: గంపలగూడెం మండలం లింగాల గ్రామంలో పోలీసులు డ్రగ్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించి గ్రామాన్ని “డ్రగ్స్ రహిత గ్రామం”గా ప్రకటించారు. డీసీపీ బి.లక్ష్మీనారాయణ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏసీపీ వై.ప్రసాదరావు తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.