అన్నమయ్య: మదనపల్లిలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులతో సమీక్ష నిర్వహించి, సాంకేతిక ఆధారిత పరిపాలనను బలోపేతం చేయాలని సూచించారు. సీసీటీవీ అనలిటిక్స్, డ్రోన్ల వినియోగం, డేటా ఆధారిత పాలన, వాట్సాప్ గవర్నెన్స్ వంటి అంశాలపై రాష్ట్ర స్థాయి సమావేశం అనంతరం జిల్లాలో అమలు చర్యలపై చర్చించారు.ప్రజలకు వేగవంతమైన సేవలు అందించడం ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ తెలిపారు.