TG: ఎంబీబీఎస్ విద్యార్థి గౌరీకి మాజీ మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. HYD పటాన్చెరు మహేశ్వర వైద్య కళాశాలలో బొరెల్లి గౌరీ ఎంబీబీఎస్ చదువుతోంది. ఆమె కొల్లాపూర్ నియోజకవర్గం కల్వరాల గ్రామానికి చెందిన విద్యార్థిని. ఆర్థిక పరిస్థితి సరిగాలేక గౌరీ ఫీజులు చెల్లించలేకపోయింది. ఈ విషయం కేటీఆర్ దృష్టికి రావడంతో.. ఆయన ఆర్థిక భరోసా ఇచ్చారు.