SRPT: అనంతగిరి మండల పరిధిలోని తమ్మర బండపాలెం గ్రామ చేపల మార్కెట్ వద్ద మృతిచెందిన గుర్తుతెలియని వ్యక్తి ఆచూకీ లభ్యమైంది. మృతుడు ఖమ్మం జిల్లా బోదులబండకు చెందిన చల్ల నవీన్(36)గా పోలీసులు గుర్తించారు. మామిడి ట్రాన్స్పోర్ట్ ఆటో డ్రైవర్గా పనిచేసే నవీన్, ఇంటికి వెళ్తుండగా ఎండ తీవ్రత తట్టుకోలేక కుప్పకూలి మృతి చెందినట్లు అనంతగిరి మండల పోలీసులు తెలిపారు.