BHNG: చౌటుప్పల్‌కు చెందిన ఏడున్నర నెలల గర్భిణికి హైదరాబాద్ యశోద ఆస్పత్రిలో వైద్యులు అరుదైన చికిత్స చేసి ప్రాణాలు కాపాడారు. “ప్లాసెంటా పర్క్రేటా” కారణంగా గర్భాశయం చీలి తీవ్ర రక్తస్రావం జరిగినట్లు గుర్తించారు. గర్భంలోని శిశువు మృతి చెందగా, డాక్టర్ వీవీ జ్యోత్స్న నేతృత్వంలోని వైద్య బృందం ప్రత్యేక శస్త్రచికిత్సతో మహిళ ప్రాణాలు రక్షించారు.