ELR: జిల్లాలో జనగణనను ఇప్పటివరకు 86.39 శాతం పూర్తి చేశామని కలెక్టర్ కె. వెట్రిసెల్వి వెల్లడించారు. శుక్రవారం సచివాలయం నుండి సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్, రాష్ట్ర సెన్సస్ డైరెక్టర్ నివాస్తో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.జిల్లాలో మొత్తం 18,97,469 మందికి గాను, ఇప్పటివరకు 16,39,307 మంది గణన పూర్తయిందన్నారు.