KDP: వేంపల్లి మండలం చింతలమడుగు పల్లె వ్యవసాయ సహకార సంఘం కార్యాలయానికి రైతులు తాళాలు వేసి నిరసన చేపట్టారు. రుణాల వడ్డీ రెన్యువల్ చేయకుండా కోట్ల రూపాయలు అక్రమాలకు పాల్పడ్డారని సీఈవో రామిరెడ్డిపై రైతులు ఆరోపించారు. కడప సొసైటీ బ్యాంక్ స్పెషల్ ఆఫీసర్ కమలను రైతులు చుట్టుముట్టి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.