కృష్ణా: గుడివాడ కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయ స్వర్ణ కిరీటం వివాదం ముగిసింది. తాకట్టులో ఉన్న కిరీటాన్ని ట్రస్ట్ సభ్యులు విడిపించి మీడియాకు చూపించారు. కళామందిర నిర్మాణ నిధుల కోసమే తాకట్టు పెట్టామని, జరిగిన తప్పుకు భక్తులు క్షమించాలని ఛైర్మన్ పోకూరి మోహనరావు కోరారు. శనివారం సంప్రోక్షణ అనంతరం కిరీటాన్ని స్వామివారికి తిరిగి అలంకరించనున్నట్లు తెలిపారు.