MNCL: లక్షెట్టిపేట మండలంలోని 18 గ్రామ పంచాయతీలలో నిర్వహిస్తున్న జనగణన సర్వేపై స్థానిక తహసీల్దార్ దిలీప్ కుమార్ సమీక్ష నిర్వహించారు. శుక్రవారం లక్షెట్టిపేట పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో జన గణన సూపర్వైజర్లు, ఎన్యూమారేటర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఇంటికి వెళ్లి సూపర్వైజర్లు, సిబ్బంది జన గణన సర్వేను పకడ్బందీగా నిర్వహించాలన్నారు.