కోనసీమ: అమలాపురంలో ఉన్న జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం ఎస్పీ రాహుల్ మీనా ఆధ్వర్యంలో ‘ఎస్పీ-సంపర్క్’ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ విభాగాల పోలీస్ అధికారులు, సిబ్బంది మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫోన్ ద్వారా తమ వ్యక్తిగత విధి నిర్వహణ సమస్యలను ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. పలు సమస్యలను ఎస్పీ తక్షణమే పరిష్కరించారు.