SKLM: టెక్కలి మండలం మేఘవరం పంచాయతీ జీడిపేట గ్రామంలో శుక్రవారం ‘ఆది కర్మ యోగి అభియాన్’ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీడీవో ఎం.రేణుక గిరిజనుల సమస్యలు తెలుసుకుని వినతులు స్వీకరించారు. వాటిని ఐటీడీఏ దృష్టికి తీసుకెళ్తామన్నారు. జీసీ డిపో మరమ్మతు, మినీ పీహెచ్సీ, అంగన్వాడీ భవనాల నిర్మాణం, బ్రిడ్జిలు, రోడ్ల ఏర్పాటు చేయాలని నాయకులు కోరారు.