ASR: పాడేరు ఐటీడీఏలో శుక్రవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి 104 ఫిర్యాదులు అందాయి. జేసీ శ్రీపూజ, పీవో ఆదిత్య వర్మతో కలిసి కలెక్టర్ నిశాంతి వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. రహదారి, తాగునీటి సమస్యలపై అధికంగా ఫిర్యాదులు అందాయి. పీజిఆర్ఎస్లో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.