అనకాపల్లి మండలం తుంపాల వద్ద ఎల్లయ్య గ్రోయిన్ మరమ్మతు పనులను ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ శుక్రవారం పరిశీలించారు. దీని మరమ్మతులకు రూ.1.19 కోట్లు మంజూరైనట్లు పేర్కొన్నారు. నీటి సంఘాల పర్యవేక్షణలో మరమ్మతు పనులను నాణ్యతతో చేపట్టాలన్నారు. ఈ పనులు పూర్తయితే సాగునీటి సౌకర్యం మెరుగుపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ ఏఈ రూప పాల్గొన్నారు.