ELR: జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి యన్.శ్రీదేవి శుక్రవారం ఏలూరు ప్యానల్ న్యాయవాదులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్యానల్ న్యాయవాదులు కేసులను త్వరితగతిన పరిష్కరించడానికి కృషి చేయాలని, విధుల్లో ఎలాంటి అలసత్వం వహించరాదని స్పష్టం చేశారు.రానున్న జులై 11వ తేదీన నిర్వహించబోయే జాతీయ లోక్ అదాలత్లో గరిష్ట సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యేలా చూడాలన్నారు.