VSP: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష-2026ను ఈనెల 24న జిల్లాలోని 17 కేంద్రాల్లో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 7,763 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, సీసీ కెమెరాలు, భద్రతా ఏర్పాట్లు కల్పించాలని జాయింట్ కలెక్టర్ విద్యాధరి అధికారులను ఆదేశించారు.