KDP: YCP నేత సత్య సాయినాథ్ శర్మ శుక్రవారం కమలాపురంలో CM చంద్రబాబు తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. సంపద సృష్టి పేరుతో పుష్పగిరి మఠం భూములను అమ్మకానికి పెట్టడం విచారకరమని, దేవుడి ఆస్తులకు బదులు హెరిటేజ్ ఆస్తులు అమ్మి ఖజానా నింపవచ్చని ఆయన ఎద్దేవా చేశారు. దేవుడికి ద్రోహం చేస్తే కూటమికి పతనం తప్పదని,ఉత్తర్వులు రద్దు చేసి ఆస్తులను కాపాడాలని ఆయన డిమాండ్ చేసారు.