W.G: తణుకు పట్టణ పరిధిలో శుక్రవారం జరిగిన అగ్నిప్రమాదంలో మూడు ఎకరాల కోకోతోట దగ్ధమైంది. తణుకు పాతవూరు నుంచి వీరభద్రపురం వెళ్లే రోడ్డులో ఆర్.రఘుకు చెందిన కోకో తోటలో మంటలు చెలరేగినట్లు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం వచ్చింది. అగ్నిమాపక శాఖ అధికారి అజయ్ కుమార్, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పి వేశారు. ఈ ఘటనలో రూ.2 లక్షల ఆస్తి నష్టం జరిగింది.