MDCL: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే టీం, చర్లపల్లి, సంత్రాగాచి మధ్య నడుస్తున్న ప్రత్యేక రైలు సేవలను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన రవాణా అందుబాటులోకి రానుంది. ప్రయాణికులు ముందుగానే తమ టికెట్లను IRCTC యాప్, అధికారిక రైల్వే కౌంటర్లలో బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.