PPM: మాదక ద్రవ్యాల వ్యసనాలతో శారీరక, మానసిక ఆరోగ్యానికి పెను ముప్పు వాటిల్లుతుందని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. భాస్కరరావు పేర్కొన్నారు. ఈ మేరకు మాదక ద్రవ్యాల వ్యసన పరుల జిల్లా పునరావాస కేంద్రాన్ని శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. ఇంతవరకు ఎంతమందిని డీ అడిక్షన్ కేంద్రంలో చేర్చారు, వారికి అందిస్తున్న వైద్య సేవలు, రికార్డులను తనిఖీ చేశారు.