సత్యసాయి: రేషన్, గ్యాస్ పంపిణీ సేవల్లో వినియోగదారుల సంతృప్తి శాతాన్ని (IVRS) పెంచడంతో పాటు సేవల నాణ్యతను మెరుగుపరచాలని జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం పుట్టపర్తిలో కలెక్టరేట్ లో జిల్లా పౌరసరఫరాల అధికారులు, గ్యాస్ కంపెనీ ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అదనపు ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.