VZM: జిల్లాలో 2027 సెప్టెంబరు నాటికి శతశాతం అక్షరాస్యత సాధించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఇంఛార్జి కలెక్టర్ సేధు మాధవన్ సూచించారు. అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. జులై 21 నుంచి ప్రారంభమయ్యే రెండో విడత అక్షరాంధ్ర కార్యక్రమంలో జిల్లాలో 1,25,469 మంది నిరక్షరాస్యులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.