NTR: వీరులపాడు(M) జుజ్జూరు- చట్టనవరం రహదారిలో శుక్రవారం తోటలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటలు వేగంగా వ్యాపించడంతో సుమారు మూడు ఎకరాల పంట దగ్ధమైందని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. ఈ ఘటనలో రైతుకు దాదాపు లక్ష రూపాయల మేర పంట నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.