JGL: జగిత్యాల రూరల్ మండలం హబ్సిపూర్ గ్రామంలో శుక్రవారం పెద్దమ్మ తల్లి పట్నాలు, బోనాల కార్యక్రమం ఘనంగా నిర్వాహించారు. ఈ సందర్భంగా వేడుకల్లో BRS ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ముదిరాజ్ సోదరులు కాయ కష్టానికి ప్రతీకలని ఆయన పేర్కొన్నారు. మత్స్యకారులకు ప్రభుత్వ సహాయం అందాలని, పెద్దమ్మ తల్లి దీవెనలు సమాజంపై ఉండాలని వారు ఆకాంక్షించారు.