అన్నమయ్య: చౌడేపల్లి మండలం బోయకొండ షికారిపాల్యంలో ప్రేమ వివాహానికి కుటుంబ సభ్యులు నిరాకరించడంతో శివాని(22) అనే యువతి విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతోంది. కర్ణాటకలోని షికారిపురకు చెందిన రాఘవ్తో ప్రేమ వ్యవహారం కారణంగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం.