ASF: తడోబా రిజర్వ్, ఆసిఫాబాద్ కడంబా ప్రాంతాల్లో పులుల సంచారం పెరగడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పొలాల్లో వంగి పనిచేసే వారిని వన్యప్రాణులుగా భావించి పులులు దాడులు చేస్తున్నాయని అధికారులు తెలిపారు. పులుల నివాస ప్రాంతాల్లో మానవ సంచారం పెరగడమే ఈ ఘర్షణలకు ప్రధాన కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ హెచ్చరించింది.