కోనసీమ: రామచంద్రపురం మండల ఎంపీపీ అంబటి భవానిని వైసీపీ రాష్ట్ర ప్రచార విభాగం ఉపాధ్యక్షురాలిగా నియమించారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి Y.S. జగన్ ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి శుక్రవారం అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ నియామకంపై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. పార్టీ బలోపేతం కోసం భవాని మరింత కృషి చేస్తానని తెలిపారు.