ADB: చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఉపేక్షించేది లేదని ఇచ్చోడ CI రమేష్ శుక్రవారం తెలిపారు. మండలంలోని చిన్న గోధుమ గ్రామస్తులు పెందూరు కృష్ణకు చెందిన ఎడ్లను దొంగలించారనే అనుమానంతో గుండాల గ్రామానికి చెందిన షేక్ జలీల్, రాబిన్ సింగ్ను పట్టుకొని తాళ్లతో కట్టేసి కట్టెలతో కొట్టినట్లు వెల్లడించారు. ఈ మేరకు 8 మంది నిందితులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.