SRD: కంది సమీపంలోని RTA కార్యాలయం ముందు రోడ్డు ప్రమాదంలో 60 ఏళ్ల అలివేణి అనే మహిళ మృతి చెందారు. శంకర్ పల్లి – కంది వైపు వస్తున్న పాసెంజర్ ఆటో, RTA కార్యాలయం ముందు నిలిచి ఉన్న టిప్పర్ లారీని ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.