KMM: ఏన్కూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ గ్రేడ్-2 కార్యదర్శిగా దుగ్గిరాల నిర్మల శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. బూర్గంపాడు నుంచి పదోన్నతిపై ఇక్కడికి వచ్చిన ఆమెకు మార్కెట్ కమిటీ ఛైర్మన్ గుగులోత్ లచ్చిరాం నాయక్ శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. మార్కెట్కు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరం సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు.