GNTR: తెనాలి మండలం పెదరావూరులో కారు అదుపుతప్పి బీభత్సం సృష్టించింది. తెనాలి నుంచి చెరుకుపల్లి వెళుతున్న కారు గ్రామంలోని పంచాయతీ కార్యాలయం వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న షాపులలోనికి దూసుకు వెళ్ళింది. కారు వేగంగా ఢీకొట్టడంతో షాపుల వద్ద ఉన్న కూరగాయలు, బల్లలు, బోర్డులు ధ్వంసం అయ్యాయి. ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదని స్థానికులు తెలిపారు.