VSP: మత్స్యకార సేవ పథకం కింద అందాల్సిన ఆర్థిక సాయం కొందరు అర్హుల ఖాతాల్లో జమ కాకపోవడంతో విశాఖ ఫిషింగ్ హార్బర్లో ఆందోళన నెలకొంది. జిల్లాలో గుర్తించిన 13,597 మంది అర్హుల్లో 11,224 మందికి రూ.20 వేల చొప్పున సాయం జమ కాగా, మిగిలిన 2,373 మందికి ఇంకా జమ కాలేదు. దీంతో మత్స్యకార సంఘాలు ప్రభుత్వాన్ని నిలదీస్తుండగా, రాజకీయ పార్టీల మధ్య విమర్శలు పెరుగుతున్నాయి.