KDP: ఖాజీపేట మండలం పుల్లూరు యానాది కాలనీలోని అటవీ శాఖ పరిసర అభివృద్ధి సమితి కమ్యూనిటీ హాల్ భవనం శిథిలావస్థకు చేరుకుంది. భవనం పాడవడంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్వయం సహాయక సంఘ సమావేశాలు, గ్రామసభలు నిర్వహించుకోవడానికి చోటు లేక అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ భవనానికి మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.