విజయవాడ ఇంద్రకీలాద్రిపై శుక్రవారం భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వేసవి సెలవులు, శుక్రవారం కావడంతో వేలాది మంది దుర్గమ్మ దర్శనానికి తరలివచ్చారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా దేవస్థాన ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ(గాంధీ), ఇన్ఛార్జ్ ఈవో రంగారావు క్యూలైన్లను పర్యవేక్షించారు. రద్దీతో ఉదయం 10 గంటల నుంచి అంతరాలయ దర్శనాలు నిలిపివేశారు.