TG: తెలంగాణ విద్యాకమిషన్ ఛైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా చేశారు. CSకి తన రాజీనామా లేఖను పంపించారు. తనకు అప్పగించిన పనిని పూర్తి చేసినందున.. రాజీనామా చేసినట్లు చెప్పారు. కాగా, విద్యావ్యవస్థలో తీసుకురావాల్సిన సమూల మార్పులు, సంస్కరణలపై సీఎం రేవంత్ రెడ్డికి ఆకునూరి మురళి నివేదికను అందజేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే పదో తరగతి పరీక్షలను తీసేయాలనే ఆలోచనలో ఉన్నారు.