VSP: వివాదాలు, రెవెన్యూ సమస్యలు లేని గ్రామాల నిర్మాణమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. ‘వన్ మంత్–వన్ కానిస్టిట్యూయెన్సీ–ఫోర్ విజిట్స్’ కార్యక్రమాన్ని ఆనందపురంలో ప్రారంభించిన ఆయన, ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ పాల్గొన్నారు.